అదుపుతప్పి కిందపడిన బైక్‌‌‌‌, ముగ్గురు మృతి.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఘటన

అదుపుతప్పి కిందపడిన బైక్‌‌‌‌, ముగ్గురు మృతి.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఘటన

లింగంపేట, వెలుగు : బైక్‌‌‌‌ అదుపుతప్పి కిందపడడంతో ముగ్గురు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్‌‌‌‌గడ్డ శివారులో శనివారం రాత్రి జరిగింది. గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్‌‌‌‌, ఉత్తరప్రదేశ్‌‌‌‌ రాష్ట్రాలకు చెందిన లాల్తూర్‌‌‌‌ ముఖియా (21), రాహుల్​(21), జావీద్​అన్సారీ (22) రాంపూర్‌‌‌‌ గడ్డ శివారులోని భావన రైస్‌‌‌‌మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నారు.

శనివారం రాత్రి బైక్‌‌‌‌పై రాంపూర్‌‌‌‌ గడ్డ నుంచి గాంధారి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సివారులోని కల్వర్టు వద్దకు రాగానే బైక్‌‌‌‌ అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకుపోయింది. ప్రమాదంలో ముగ్గురికీ తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.