కోటగిరి,వెలుగు: గ్రామ దేవతల కటాక్షంతోనే గ్రామాలు సుభిక్షంగా ఉంటున్నాయని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. నిజామాబాద్ కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో కొత్తగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజించే గ్రామాలు ఆ దేవతల దీవెనలు, కృపాకటాక్షంతో చల్లగా ఉంటాయన్నారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలందరికీ తప్పకుండా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హన్మంత్, సర్పంచ్ శ్వేత, లీడర్లు బర్ల మధు, షాజీ పటేల్, శ్రీధర్, గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సర్‌లో అర్హులైన ఓట్లు పోకుండా చూడాలి
ఆర్మూర్, వెలుగు: ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వేలో అర్హులైన ఓట్లు పోకుండా కాంగ్రెస్ ఏజెంట్లు చూడాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కోటగిరి వెళ్తూ బుధవారం ఆర్మూర్‌లో ఆగిన మంత్రిని కాంగ్రెస్ నాయకులు కలిసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
