బషీర్బాగ్, వెలుగు: సిటీలో వరుస బైక్దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్, గాంధీ నగర్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్ ఎంఎం పహాడీకి చెందిన మహ్మద్ రియాజ్ (18), సయ్యద్ అహ్మద్ అలీ (18), మహ్మద్ ఫర్థీన్ (18)తో పాటు ఓ మైనర్ కలిసి పార్కింగ్ ఏరియాల్లో వాహనాలను దొంగిలిస్తున్నారు.
కొట్టేసిన బండ్లతో స్టంట్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. వీరి పోస్టులు, కదలికలపై నిరంతరం నిఘా పెట్టిన పోలీసులు టెక్నికల్ ఆధారాలతో శుక్రవారం అత్తాపూర్ ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్, గాంధీనగర్, కొల్లూర్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. వీరి వద్ద నుంచి 8 హోండా డియోలు, ఒక హీరో గ్లామర్, ఒక బజాజ్ పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు.

