
పద్మారావునగర్, వెలుగు: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేసిన ఓ క్యాబ్ డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ తెలిపారు. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం ప్రెస్మీట్లో వెల్లడించారు. ఈ నెల 5న ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రవీణ్, చంటి బైక్‌పై పెట్రోలింగ్ చేస్తున్నారు. ఓ నిర్మానుష్య ప్రదేశంలో నిలిపి ఉన్న కారులో క్యాబ్ డ్రైవర్సంపత్కుమార్ఓ మహిళతో ఉన్నాడు.
పోలీసులు వారిని ప్రశ్నించే సమయంలో అతను సడన్‌గా కారుతో పోలీసుల బైక్ ను ఢీకొట్టి, పరారయ్యాడు. ఈ ఘటనలో ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. హత్యాయత్నం కేసు నమోదు చేసి, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా క్యాబ్ డ్రైవర్ సంపత్‌కుమార్ పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అతన్ని అరెస్ట్‌చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
కత్తితో పక్కింటి వ్యక్తి అటాక్..
అబ్దుల్లాపూర్ మెట్: పక్కపక్కనే నివాసముండే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎర్రం వెంకటేశ్(40) తన కుటుంబంతో రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని ఇందిరమ్మ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. పక్కనే ఉండే రమేశ్‌తో అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి గొడవ జరగగా వెంకటేశ్‌పై రమేష్ కత్తితో దాడి చేశాడు. పోలీసులు వెంకటేశ్‌ను ఆస్పత్రికి తరలించి రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.