ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ..రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ..రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్

అమరావతి, వెలుగు: మూడు రాజధానుల ఏర్పాటు , అమరావతి అభివృద్ధిపై శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. రాజధానుల ఏర్పాటు , రాష్ర్టాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబు ల్ ప్లాట్ల కేటాయింపు ఇతర అంశాలపై చర్చిం చనున్నారు. అమరావతి నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఆర్టీఏపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

రాజధాని రైతుల అభిప్రాయాల సేకరణ , ప్లాట్ల అభివృద్ధి కోసం కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఆంధ్రాలో 3 రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఎం జగన్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రకటించారు. దీంతో అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. అమరావతిలో  ఆందోళనలు కొనసాగుతుండటంతో కేబినేట్ సమావేశానికి పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు.