దళితులకు పది పైసలైనా ఇచ్చిన్రా ? : చల్లా ధర్మారెడ్డి

దళితులకు పది పైసలైనా ఇచ్చిన్రా ? : చల్లా ధర్మారెడ్డి

హనుమకొండ (పరకాల), వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ అంటేనే దళిత, గిరిజన వ్యతిరేక పార్టీ అని పరకాల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌‌‌‌దేనన్నారు. కాంగ్రెస్‌‌‌‌ పాలనలో తండాలను ఎందుకు పంచాయతీలుగా మార్చలేదో, పోడు భూముల సమస్యను ఎందుకు పరిష్కరించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. వందేళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌‌‌‌ ఏనాడైనా దళితులకు పది పైసలు ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్లలో కాంగ్రెస్‌‌‌‌ పది వేల ఉద్యోగాలు ఇస్తే, తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లలోనే 1.60 లక్షల ఉద్యోగాలిచ్చామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరికలు

ఆత్మకూరు, వెలుగు : హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన పెంచికల్‌‌‌‌పేట పీఏసీఎస్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ రమేశ్‌‌‌‌, ఆత్మకూరు వార్డు మెంబర్‌‌‌‌ శ్యాంసుందర్‌‌‌‌రెడ్డి ఆదివారం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. వారికి పరకాల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ చల్లా ధర్మారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాలలో బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ ఖాళీ కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌‌‌‌ వంగాల స్వాతి భగవాన్‌‌‌‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కంది శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, కో ఆప్షన్‌‌‌‌ మెంబర్‌‌‌‌ అంకుస్, ఎంపీటీసీ బీరం రజినీకర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.