- కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: బోర్డర్‌లో చైనాతో జరుగుతున్న గొడవలపై రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. చైనా ఆర్మీ మన దేశంలోకి వచ్చిందా రాలేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని అడిగారు. “ చైనా ఆర్మీ మన దేశంలోకి రాలేదనే విషయాని ధ్రువీకరించండి. ఇలా సైటెంట్‌గా ఉంటే ఊహాగానాలు పెరిగిపోతాయి. ప్రజలకు నిజం తెలియాలి” అని రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్ చేశారు. అంతే కాకుండా చైనా, ఇండియా మిలటరీ అధికారులు శనివారం భేటీ అవుతున్నారని వస్తున్న వార్తలను కూడా షేర్ చేశారు. సరిహద్దు గొడవలను క్లియర్ చేయాలని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించాలని ప్రభుత్వాన్ని కోరారు. చైనా ఆర్మీ కొంత మేర ఈస్ట్రన్ లడాఖ్‌లోకి వచ్చిందని, కానీ వారిని ఎదుర్కొనేందుకు మన ఆర్మీ కూడా సిద్ధంగా ఉందని, అన్ని చర్యలు తీసుకున్నామని డిఫెన్స్ మినిస్టర్ రాజనాథ్ సింగ్ చెప్పారు.
