ఆధ్యాత్మికం: దేవుడి మందిరం ఉన్న గదిలో భోంచేయవచ్చా.. ఒకే గదిలో ఉంటున్నవారు ఏంచేయాలి..!

ఆధ్యాత్మికం:  దేవుడి మందిరం ఉన్న గదిలో భోంచేయవచ్చా.. ఒకే గదిలో ఉంటున్నవారు ఏంచేయాలి..!

ప్రతి ఒక్కరి ఇళ్లల్లో దేవుడి మందిరం.. ఒక పీటపై దేవుడి పటాలు పెట్టడం.. లేదా గోడకు ఒక చెక్కను బిగించి దానిపై దేవుడి పటాలు ఉంచి రోజూ పొద్దున్నే స్నానం చేసిన తరువాత దీపారాధన చేసి .. అగర్​బత్తీలు వెలిగించి  నమస్కారం చేస్తారు. చిన్న కుటుంబాలు తరచుగా వారు కూర్చునే, మాట్లాడే, భోజనం చేసే గదిలోనే గుడిని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల చాలా మందికి ఒకే ప్రశ్న వస్తుంది. గుడి ఉన్న గదిలో భోజనం చేయడం సరైనదేనా? ఇలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ... అనే విషయాల గురించి  ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ..

పూర్వకాలంలో పెద్ద పెద్ద ఇళ్లు ఉండేవి.. వంటగది.. దేవుడి గది.. హాలు .. బెడ్​ రూం.. వరండా ఇలా ఉండేవి.  కాని ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు కాస్త సింగిల్​ ఫ్యామిలీగా మారిపోయాయి.  సింగిల్​ బెడ్​ రూం..  అదీ కుదరకపోతే సింగిల్​ రూంలోనే నివసిస్తున్నారు.  

సిటీలలో ఏదో ఒక పని చేసుకుంటూ ఒకే గదిలో ఉంటూ నివసించే వారుఅధికంగా ఉన్నారు.  కాని వారు కూడా  ఉన్న స్థలంలో దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు.  ఇలా చేయడం తప్పేమి కాదు కాని కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.

  ఎంత చిన్న ఇంటిలో ఉన్నా... ఒకే గదిలో ఉంటున్నా.. దేవుడి మందిరం కామన్​ గా ఉంటుంది.  దేవుడి మందిరం ఉన్న స్థలం అంటే ఎంతో పవిత్రమైనది.   ఒకేగదిలో ఉండేవారు కచ్చితంగా దేవుడి మందిరాన్ని కర్టన్​ ఏర్పాటు చేసుకోవాలి.  దేవుడికి పూజ చేసే సమయంలో కర్టన్​ తొలగించాలి.  దీపారాధన.. అగర్​ బత్తీలు కొండెక్కిన తరువాత ( పూర్తిగా ఘనమైన) మరల కర్టన్​ వేయాలి.  ఎందుకంటే.. అదే గదిలో భోజనం చేయడం.. నిద్ర పోవడం లాంటివి చేస్తుంటాము. భోజనం చేసేటప్పుడు ఆ ప్రాంతమంతా ఎంగిలి అవుతుంది. దానినే కొంతమంది అంటు అని కూడా అంటారు.  ఆ ప్రాంతం అపరిశుభ్రంగా ఉంటుంది.  

దేవుడి మందిరం అంటే గుడితో సమానం. ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రంగా ఉంచకూడదు.  అందుకే ఒకే గదిలో ఉంటున్నవారు దేవుడి మందిరానికి కర్టన్​ కడితే అది ఒక గదిమాదిరిగా ఉంటుంది.  పూజ గది చాలా మంది భారతీయ గృహాలలో తప్పనిసరి భాగం. ఇది ప్రశాంతమైన, పవిత్రమైన స్థలం. ఇక్కడ కూర్చుని ప్రజలు పూజలు చేస్తారు. దైవానికి దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు. అయితే, చిన్న ఇళ్లలో స్థలం ఎక్కువగా ఉండదు. చిన్న ఇళ్లలో నివసించే వారికి మందిరాన్ని ఎక్కడ పెట్టాలి అనే అయోమయం ఉంటుంది. 

పరిశుభ్రత ముఖ్యం: గుడిని పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచాలి. పూజ ఒక పవిత్రమైన క్రియ. భోజనం రోజూ చేసే కార్యమే అయినా, ఆహారం తీసుకోవడం వల్ల ఆ వాసనలు, శబ్దాలు, కొన్నిసార్లు అపరిశుభ్రత ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే దేవుడి మందిరానికి కర్టన్​ ఏర్పాటు చేయాలి.  భోజనం చేసిన తరువాత ఆ ప్రాంతాన్ని నీటితో శుద్ది చేయాలి.  

ఉద్దేశం ప్రధానం:  దేవుడి మందిరం ఉన్న గదిలో  భోజనం చేయడం వల్ల  కలిగిన దోషం తొలగుతుంది.  మీ ఇల్లు చిన్నదై, మీరు ఆ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకుంటే, అదే గదిలో భోజనం చేయడం తప్పు కాదు. పరిశుభ్రత అనేది ఆ స్థలాన్ని మీరు ఎలా చూసుకుంటారు అనే దానిపై ఆధారపడుతుంది తప్ప, స్థలం ఎక్కడ ఉందనే దానిపై కాదని వారు నిపుణులు చెబుతున్నారు.

ప్రశాంతత: వాస్తు శాస్త్రం ప్రకారం దేవుడి మందిరం ఉన్న ప్రాంతంలో కొంత శక్తి ఉంటుది.  అందుకే గుడిలో  శుభ్రంగా, ప్రశాంతంగా ఉండే మూలలో ఉంచాలని ఇది సూచిస్తుంది.  ఇంట్లో దేవుడి మందిరం  బాత్రూమ్‌లు లేదా శబ్దం వచ్చే ప్రదేశాల దగ్గర ఉండకూడదు.

దూరం పాటించాలి: వాస్తు ప్రకారం, అదే గదిలో భోజనం చేయడం ఖచ్చితంగా నిషేధం కాదు. కానీ, గదిలో కొంత దూరం పాటించాలని సూచిస్తుంది. గుడిని కొంచెం ఎత్తులో ఉంచవచ్చు. ఒక మూలలో ఉంచి, గది ఇంకో వైపున భోజనం చేయవచ్చు.గుడి శుభ్రంగా, గౌరవంగా ఉన్నంత కాలం ఫర్వాలేదని చాలా మంది వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ స్థలం సానుకూల శక్తితో ఉండటమే ఇక్కడ ముఖ్య ఉద్దేశమని పండితులు చెబుతున్నారు. 

ఒకే గదిలో  నివసించే వారు  పాటించాల్సిన జాగ్రత్తలు

భారతదేశంలో చాలా ఇళ్లలో అదనపు గదులు ఉండవు. జీవనశైలి నిపుణులు ఈ సమస్యపై తరచుగా రాస్తుంటారు. అందుకే ఒకే గదిలో నివసిస్తుంటారు.  ఇలాంటి వారు రోజు పొద్దున్నే నిద్రలేచిన తరువాత.. ముఖం (పళ్లు) కడుకున్న తరువాత ఉన్న గదిని నీటితో శుభ్రం చేయాలి.  తడిబట్టతో తుడిచిన సరిపోతుంది.   ఆ తరువాత స్నానం చేసి దేవుడి మందిరానికి ఉంచిన కర్టన్​ తొలగించి దీపారాధన చేసి.. తరువాత వంట చేయాలి.  ఇంటి విషయంలో  పరిశుభ్రతను పాటించాలి. దీపారాధన మొత్తం ఘనం అయిన తరువాత మరల దేవుడి మందిరానికి కర్టన్​ వేయాలి.   భోజనం చేసిన తరువాతస్తే, అదే గదిలో భోజనం చేయడం సరైనదేనని వారు చెబుతారు.

 దేవుళ్ల విగ్రహాల ముందు నేరుగా ఆహారాన్ని ఉంచడం మానుకోవాలి. దేవుడి పటాల ఎదుట.. విగ్రహాల దగ్గర ఎలాంటి ఆహారాన్ని ఉంచకూడదు.  నివేదన లాంటివి పెట్టాల్సి వచ్చినప్పుడు.. అక్కడ చిన్న ముగ్గుపెట్టి.. అందులో అన్ని పదార్దాలు  ఆకులతో  కుట్టిన ఇస్తరాకులో  కాని.. అరటి ఆకులో కాని  కొద్ది కొద్దిగా వడ్డించి.. ముగ్గుపై పెట్టాలి.  భోజనం చేసేటప్పుడు గుడికి చిన్న తెర లేదా తలుపు వాడాలి. చిన్న అపార్ట్‌మెంట్‌ల కోసం చాలా మంది పూజారులు దీనిని సూచిస్తారు.

ఈ సాధారణ చర్యలు సమతుల్యతను కాపాడతాయి. గదిని శుభ్రంగా ఉంచండి. దేవుడి మందిరం ఉన్న ప్రాంతం చక్కగా, శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఆహార ప్రాంతానికి పూజా ప్రాంతానికి మధ్యన అవకాశం ఉన్నంత వరకు  కొంత ఖాళీ ఉంచండి. ఈ చిన్న అలవాట్లు ప్రశాంతమైన అనుభూతిని కాపాడతాయి.

సాంస్కృతిక భావాలు: దేవుడి మందిరం  ఒక ప్రత్యేక స్థలం. ఇది విశ్వాసాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. శ్రద్ధగా చేస్తే, అదే గదిలో కర్టెన్​ ఏర్పాటు చేసి భోజనం చేయడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. . రోజువారీ కార్యకలాపాల సమయంలో కూడా ఆ గది ప్రశాంతంగా అనిపిస్తుందని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.