డైటింగ్‌‌ బ్రేక్‌‌ చేయకుండా కంటిన్యూ చేయొచ్చిలా...

డైటింగ్‌‌ బ్రేక్‌‌ చేయకుండా కంటిన్యూ చేయొచ్చిలా...

కొందరు డైటింగ్‌‌లో ఉన్నామంటారు. కానీ, ఆకలికి ఆగలేక వెళ్లి ఏదోఒకటి తినేస్తారు. అలాంటివాళ్లు ఈ బ్రేక్‌‌ఫాస్ట్‌‌లు తింటే రోజులో శరీరానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. కావాల్సిన న్యూట్రియెంట్స్‌‌ కూడా అందుతాయి. పొట్ట నిండుగా ఉంటుంది. దాంతో డైటింగ్‌‌ బ్రేక్‌‌ చేయకుండా కంటిన్యూ చేయొచ్చు. 

  •  ఇడ్లీలు ఈజీగా అరుగుతాయి. ఇందులో ఫైబర్‌‌‌‌, ప్రొటీన్‌‌, విటమిన్స్‌‌ ఉంటాయి. ఇడ్లీల్లోని ఫైబర్ బరువు తగ్గడానికి సాయపడుతుంది. రవ్వ ఇడ్లీనే కాకుండా రాగులు, జొన్నలతో చేసిన ఇడ్లీలు హెల్త్‌‌కి ఇంకా మంచివి. 
  • వెజిటబుల్‌‌ శాండ్‌‌విచ్‌‌ వల్ల కూడా బోలెడు లాభాలున్నాయి. మైదా బ్రెడ్‌‌ కాకుండా గోధుమ బ్రెడ్‌‌ శాండ్‌‌విచ్‌‌ తింటే హెల్త్‌‌కి మంచిది. కూరగాయలు, పనీర్‌‌‌‌తో చేసే ఈ శాండ్‌‌విచ్‌‌లోని పోషకాలు శరీరానికి అందుతాయి. 
  • ఓట్స్‌‌... బ్రేక్‌‌ఫాస్ట్‌‌కి ఒక మంచి ఆప్షన్‌‌. ఇందులో ఐరన్‌‌, విటమిన్‌‌–బి, మాంగనీస్‌‌, మెగ్నీషియం, జింక్‌‌ ఉంటాయి. వట్టి ఓట్స్‌‌ తినడం ఇష్టంలేని వాళ్లు వాటిలో ఫ్రూట్స్‌‌ కలుపుకొని తినొచ్చు. 
  • పెసర దోశలో ప్రొటీన్‌‌, ఫైబర్‌‌‌‌తో పాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి గుండెకు చాలా మంచిది.
  • పోహా (అటుకులు) బ్రేక్‌‌ఫాస్ట్‌‌గా తింటే... కార్బోహైడ్రేట్స్‌‌, ఐరన్‌‌, ఫైబర్‌‌‌‌,  యాంటీఆక్సిడెంట్స్‌‌, విటమిన్స్‌‌ అన్నీ శరీరానికి అందుతాయి. దీన్ని కూరగాయలు వేసి వండితే హెల్త్‌‌కి ఇంకా మంచిది.