
ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల సంఖ్య: 350 (గ్రాడ్యుయేట్ అప్రెంటీస్). తెలంగాణ రాష్ట్రంలో 132 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ 21, ఎస్టీ 09, ఓబీసీ 35, ఈడబ్ల్యూఎస్ 13, అన్ రిజర్వ్ డ్ 54, పీడబ్ల్యూహెచ్ఎస్ 05.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 2022 జనవరి 1 నుంచి 2025 సెప్టెంబర్ 01 మధ్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి .
వయోపరిమితి: వయసు 20 నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి. 1997 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందు గానీ 2005 సెప్టెంబర్ 01వ తేదీ తర్వాత గానీ జన్మించి ఉండకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి కంటే ముందు www.nats.education.gov.in పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అక్టోబర్ 12.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 500.
సెలెక్షన్ ప్రాసెస్: పదో తరగతి, 12వ తరగతి లేదా డిప్లొమా సాధించిన మార్కులు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ ఫిట్నెస్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
కనీస అర్హత మార్కులు: పదో తరగతి, 12వ తరగతి లేదా డిప్లొమాలో జనరల్, ఓబీసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించినవారు అప్లై చేయడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్: పదో తరగతి లేదా 12వ తరగతిలో స్థానిక భాషా మాధ్యమంలో విద్యను అభ్యసించిన వారికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అవసరం లేదు. ఇతరులు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్టులో క్వాలిఫై కాని వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
మరిన్ని పూర్తి వివరాలకు https://canarabank.com/ వెబ్ సైట్ లో చూడొచ్చు.