
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో బుధవారం క్వశ్చన్ అవర్ రద్దు చేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు మంగళవారం ఈమేరకు బులెటిన్ విడుదల చేశారు. సోమవారం నిర్వహించిన బీఏసీ సమావేశంలో బుధవారం నుంచి 6 రోజుల పాటు క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీలో బుధవారం ఉదయం 10 గంటలకు తాను ప్రకటన చేయబోతున్నానని, నిరుద్యోగులంతా టీవీల్లో ఆ ప్రకటన చూడాలని వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం స్టేట్‌మెంట్ ఇవ్వడం కోసమే అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు చేసినట్టు తెలుస్తోంది.