పొగ తాగకున్నాక్యాన్సర్ ముప్పు.. కాలుష్యమే కారణం

పొగ తాగకున్నాక్యాన్సర్ ముప్పు.. కాలుష్యమే కారణం

బెంగళూరు: పొగరాయుళ్లకు లంగ్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరించడం చూస్తూనే ఉంటాం.. అయితే  పొగ తాగే అలవాటు ఉన్నోళ్లకే లంగ్ క్యాన్సర్ వస్తుందనుకోవడం పొరపాటని, ఈ అలవాటు ఉంటే మాత్రం ముప్పు మరింత పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో మన దేశంలో లంగ్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని బెంగళూరుకు చెందిన అస్టర్ వైట్ ఫీల్డ్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ శ్రీవాత్సవ లోకేశ్వరన్ తెలిపారు. స్త్రీపురుషులనే భేదం లేదు, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా.. జీవితంలో సిగరెట్‎ను కనీసం చేతితో తాకని వారికీ లంగ్ క్యాన్సర్ వస్తోందని చెప్పారు. 

దీనికి ప్రధాన కారణం వాతావరణ కాలుష్యమేనని ఆయన వివరించారు. అదే సమయంలో లంగ్ క్యాన్సర్‎కు ప్రధాన కారణం పొగ తాగే అలవాటేనని ఆయన స్పష్టం చేశారు. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నవారు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని వివరించారు. గాలిలో పీఎం 2.5 స్థాయులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో  ఎక్కువ కాలం ఉండడం లంగ్ క్యాన్సర్ కు దారితీస్తోందని డాక్టర్ శ్రీవాత్సవ తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు, కాన్పూర్ సహా పలు నగరాలలో  వాతావరణంలో పీఎం 2.5 స్థాయులు ఎక్కువని, దీనికి ఎక్కువకాలం ఎక్స్ పోజ్ అయితే ఊపిరితిత్తులు 
దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు.