క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి : జి. కిషన్ రెడ్డి

క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి : జి. కిషన్ రెడ్డి

బషీర్ బాగ్, వెలుగు : గుండె పోటు తర్వాత క్యాన్సర్ బారిన పడి చాలామంది మరణిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాంకోఠి కచ్చి భవన్ కచ్చి సమాజ్ మిత్ర మండలి ఆదివారం ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే  గుర్తిస్తే నివారించవచ్చని తెలిపారు. 

సమయానికి గుర్తించకపోవడంతోనే ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు.  ప్రతి ఒక్కరు విధిగా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, మంచి ఆహారం, వ్యాయామం యధావిధిగా పాటించాలని సూచించారు.  గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించాలని స్వచ్చంద సంస్థలను ఆయన కోరారు.