గౌలిదొడ్డిలో సీ అండ్ డీ వేస్ట్ ట్రాన్స్‌‌‌‌ఫర్ స్టేషన్ ప్రారంభం

గౌలిదొడ్డిలో సీ అండ్ డీ వేస్ట్ ట్రాన్స్‌‌‌‌ఫర్ స్టేషన్ ప్రారంభం

గచ్చిబౌలి, వెలుగు: గౌలిదొడ్డిలో రీ-సస్టైనబిలిటీ సహకారంతో ఏర్పాటు చేసిన సీ అండ్ డీ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని సోమవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఎంసీ ప్రత్యేక అధికారి జయేశ్​రంజన్ ప్రారంభించారు. ఈ సరికొత్త వ్యర్థాల బదిలీ కేంద్రం(ట్రాన్స్‌‌‌‌ఫర్ స్టేషన్) ద్వారా నిర్మాణ వ్యర్థాలను సేకరించి, అధికారిక ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. సీఎంసీ కమిషనర్ సృజన మాట్లాడుతూ... తక్కువ పరిమాణంలో ఉండే వ్యర్థాల కోసం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రీజనబుల్ చార్జీలతో ఆన్- డిమాండ్ కలెక్షన్ సేవలను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. 

ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ స్టేషన్​కొండాపూర్, మసీద్ బండ, గచ్చిబౌలి, నానక్‌‌‌‌రామ్‌‌‌‌గూడ, నార్సింగి, మణికొండ, నల్లగండ్ల, శేరిలింగంపల్లి ప్రాంతాలకు సేవలందిస్తుందని తెలిపారు. నిర్మాణ వ్యర్థాలకు టన్నుకు రూ.436 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్​నారాయణ్​అమిత్​, రీ  రీ-సస్టైనబిలిటీ లిమిటెడ్​సర్క్యులర్ ఎకానమీ బిజినెస్ హెడ్ కృష్ణ తోట పాల్గొన్నారు.