9 రోజుల్లో 45 వేల మంది అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నరు

9 రోజుల్లో 45 వేల మంది అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నరు

హైదరాబాద్, వెలుగు: వన్‌‌‌‌‌‌‌‌​టైమ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ (ఓటీఆర్)ను అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ అధికారులు మొత్తుకుంటున్నా అభ్యర్థుల నుంచి స్పందన రావడం లేదు. గడిచిన 9 రోజుల్లో 45,870 మంది మాత్రమే సవరణలు చేసుకున్నారు. కొత్తగా 15,710 మంది ఓటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. ఇప్పటివరకు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన మొత్తం 25 లక్షల మందిలో, 45 వేల మంది మాత్రమే అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడంపై టీఎస్పీఎస్సీ అధికారులు కలవరపడున్నారు. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల వివరాలను మార్చి 28వ తేదీ నుంచి మార్చుకునేందుకు వీలుగా ఓటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేషన్‌‌‌‌‌‌‌‌కు కమిషన్‌‌‌‌‌‌‌‌ అవకాశం ఇచ్చింది. కొత్త పోస్టులకు అప్లయ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలంటే కచ్చితంగా ఓటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో ఓటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలంటూ ప్రతి రోజూ లక్ష మందికి మెసేజ్‌‌‌‌‌‌‌‌లు పంపుతున్నా.. అభ్యర్థుల్లో స్పందన రావడం లేదు. మరో వారం, పది రోజుల్లో గ్రూప్‌‌‌‌‌‌‌‌​1 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ వెలువడనున్న నేపథ్యంలో ఒకేసారి అందరూ ఓటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తే సర్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్ అవుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వీలైనంత తొందరగా ఓటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. 

ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చుకునేందుకు చాన్స్.. 

ఓటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడిట్‌‌‌‌‌‌‌‌ చేయడానికి టీఎస్పీఎస్సీ ఐడీతో పాటు పుట్టిన తేదీ వివరాలు ఇస్తే మొబైల్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి లాగిన్‌‌‌‌‌‌‌‌ అవ్వాలి. అయితే గతంలో ఇచ్చిన ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోతే కొత్త నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఫోన్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేయడానికి helpdesk@tspsc.gov.inకు మెయిల్ చేయాలని లేదా హెల్ప్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంప్రదించాలన్నారు.