స్టూడెంట్లతో  గంజాయి సప్లయ్

స్టూడెంట్లతో  గంజాయి సప్లయ్

‘సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన చామకూర లఖన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(22), పోల పృథ్వీ(22), గుల్లబాను ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(22) డిగ్రీ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ముగ్గురు మద్యం, సిగరెట్లకు అలవాటుపడ్డారు. జనగామ పామర్రుకు చెందిన బత్తిని రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర గంజాయి, హాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను కొంటూ వాటికి బానిసలయ్యారు.  ఆ తర్వాత గంజాయి సప్లయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారి హాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మారు. వీరి గురించి తెలుసుకున్న నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోన్ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ పోలీసులు ఈ నెల 6న ముగ్గురు స్టూడెంట్లతో పాటు ఇద్దరు గంజాయి సప్లయర్స్ ను అరెస్ట్ చేశారు. రూ. 2 లక్షల 40 వేల విలువైన హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,వెలుగు:  గంజాయి, డ్రగ్స్ మాఫియా యువత, స్టూడెంట్లు టార్గెట్ చేస్తూ వారిని మత్తుగా బానిసలుగా చేసి సప్లయర్స్ గా మారుస్తోంది. స్టూడెంట్లు కమీషన్ తీసుకుని గంజాయి అమ్ముతున్నారు. వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒరిస్సాలోని ఏజెన్సీల నుంచి మహారాష్ట్రకు ట్రాన్స్ పోర్టు చేస్తున్నారు.  చైన్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుని సప్లయ్ చేస్తున్నారు. గంజాయి నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిక్కి స్టూడెంట్లు జైలు పాలవుతున్నారు. నెలరోజుల్లో గ్రేటర్ పరిధిలో17 మంది స్టూడెంట్లు గంజాయి సప్లయ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. గంజాయి,హాష్ ఆయిల్ సప్లయర్స్ గా  మారడానికి గల కారణాలను పోలీసుల విచారణలో వారు వివరించారు. 
వైన్స్, బార్​లు అడ్డాగా దందా
వైన్స్, బార్ షాప్ లు అడ్డాగా స్టూడెంట్లు, యువత గంజాయి సప్లయర్స్ తో కాంటాక్ట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్ల తరహాలోనే గంజాయి సప్లయర్స్ కూడా లిక్కర్ షాప్ ల వద్ద మకాం వేస్తున్నట్లు విచారణలో తేలింది. అందరితో కలిసి పోతూ మద్యం తాగుతున్న యువత, స్టూడెంట్లతో మాటమాటా కలిపి గంజాయి  గురించి చెప్తున్నారు. తమ ట్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిక్కిన వారికి శాంపిల్ గా కొంత డ్రై గంజాయి ఇస్తున్నారు. అప్పటికే లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మత్తులో ఉన్న వారిని మరింత మైకంలోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ముందుగా 1 గ్రామ్ గంజాయిని రూ.200 నుంచి రూ.300కు అమ్ముతున్నారు. ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుని మళ్లీ కాంటాక్ట్ అవుతున్నారు. ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేసిన వారికి డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 
ఫ్రెండ్స్​లో ఒకరిని ట్రాప్ చేసి..
స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,యువతను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన గంజాయి స్మగ్లర్లు వారిని కూడా సప్లయర్స్ గా మారుస్తున్నారు. ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకరిని ట్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి చైన్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి లాగుతున్నారు.  గంజాయితో మొదలు పెట్టి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బానిసలుగా తయారుచేస్తున్నారు.   పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చే పాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనీతో యువత, స్టూడెంట్లు గంజాయి కొంటున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి దాన్ని షేర్ చేసుకుంటున్నారు. తక్కువ రేటుకి ఎక్కువ మత్తు వస్తుండడంతో యువత రెగ్యులర్ లిక్కర్ పార్టీలకు బదులు.. గంజాయి పార్టీలను చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.  పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తించకుండా ఉండేందుకు కొందరు సిగరెట్లలో డ్రై గంజాయి పౌడర్ ను ఉంచి స్మోకింగ్ చేస్తున్నారు.  ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కిల్ లో ఒక్కరు గంజాయికి బానిసైనా.. మిగతా వారికి చైన్ సిస్టమ్ ద్వారా సప్లయ్ అవుతోన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

సప్లయర్స్, ఏజెంట్లపై నిఘా పెట్టాం
డ్రగ్స్, గంజాయి సప్లయర్స్, ఏజెంట్లపై నిఘాపెట్టాం. ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లు గంజాయి, డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్నట్లు తెలిసింది.  పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారనేది పేరెంట్స్ గమనించాలి. సిగరెట్ స్మోకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే వారిపై నిఘా పెట్టాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా మత్తు నుంచి బయటపడేసేందుకు డాక్టర్లు,కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంప్రదించాలి. డ్రగ్స్, గంజాయి గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
‑ సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్
గంజాయి అమ్ముతున్న ముగ్గురిపై పీడీ యాక్ట్
నేరెడ్ మెట్: గంజాయి అమ్ముతున్న ముగ్గురిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఆకాశపు శివాజీ(30) కుషాయిగూడలో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. శ్రీకాకుళంలో ఉండే తన ఫ్రెండ్స్  బుసిని సింహాచలం అలియాస్ చంటి( 32), అనెం జగదీశ్(27)తో కలిసి గంజాయి సప్లయ్ కి స్కెచ్ వేశాడు. సింహాచలం, జగదీశ్ గత నెల 1న ఏపీలోని ఒడిశా బార్డర్ వద్ద ఓ వ్యక్తి నుంచి 11 కిలోల 406 గ్రాముల గంజాయిని కొని ట్రైన్ లో మరుసటి రోజు ఉదయానికి సిటీకి చేరుకున్నారు. శివాజీ వారికి కాల్ చేసి మౌలాలికి రమ్మని చెప్పాడు. సింహాచలం, జగదీశ్ గంజాయితో మౌలాలికి చేరుకున్నారు. అదే టైమ్ లో మల్కాజిగిరి పోలీసులు వారిపై దాడి చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కి తరలించారు. ఈ ముగ్గురిపై సోమవారం పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్​భగవత్ తెలిపారు.


స్టూడెంట్స్, పేరెంట్స్ కి కౌన్సెలింగ్
మత్తుకు బానిసలై సప్లయర్స్ గా మారుతున్న యువతను పోలీసులు గుర్తించారు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 3 కమిషనేట్లలో నమోదైన డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గంజాయి కేసులను స్టడీ చేస్తున్నారు. చాలా మంది డిప్రెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మతిమరుపుస్థితిలోకి వెళ్తున్నట్లు డాక్టర్లు గుర్తించారు. స్టూడెంట్స్, పేరెంట్స్ కి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ కు బానిసలు కావొద్దంటూ స్కూల్, కాలేజీ స్టూడెంట్లతో అవేర్ నెస్ ర్యాలీలు తీయిస్తున్నారు. సోమవారం ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని ఏక్ మినార్ వద్ద సీఐ జహంగీర్ యాదవ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవేర్ నెస్ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ కట్టడికి సిటీ పోలీసులు ఏర్పాటు చేసిన నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట వింగ్ యాక్టివ్ గా పనిచేస్తోంది.