హైదరాబాద్ సిటీలో విచ్చలవిడిగా గంజాయి విక్రయం జరుగుతోంది. కొందరు ఇతర ప్రాంతాలనుంచి గంజాయి తెచ్చి సిటీలో అమ్ముతుండగా.. మరొకొందరు ఏకంగా ఇండ్లలో గంజాయి పెంచుతూ దందా చేస్తున్నారు. తాజాగా మలక్ పేట్ లో ఓ ఇంటి టెర్రస్ లో పెంచుతున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీం సీజ్ చేసింది. బీహార్ కు చెందని ఇద్దరు వ్యక్తులు గంజాయి మొక్కలను ఇంటిపైనే సాగు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
మలక్ పేట్ గంజ్ మిషన్ మార్కెట్లో ఓ భవనంలో అద్దెకు ఉంటున్న బీహార్ కు చెందిన లవకుశ, బీమ్లేష్ లు అద్దెకు ఉంటున్న భవనంపై గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన నిందితులు గత ఆరు నెలలగా భవనం టెర్రస్ పై గంజాయి మొక్కలను పెంచుతున్నారు.. మూడు నుంచి 6 మీటర్ల ఎత్తు పెరిగిన ఆరు గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. వీటితో పాటు 55 గ్రాముల ఎండు గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కాచిగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
