జేబీఎస్ బస్టాండ్ దగ్గర టిఫిన్ సెంటర్స్ చూసే ఉంటారు.. వాటిని కూల్చేశారు !

జేబీఎస్ బస్టాండ్ దగ్గర టిఫిన్ సెంటర్స్ చూసే ఉంటారు.. వాటిని కూల్చేశారు !

హైదరాబాద్: సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్స్, స్టాల్స్ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూల్చివేశారు. కంటోన్మెంట్ ల్యాండ్లో కొన్ని సంవత్సరాలుగా కొందరు దుకాణాలను, టిఫిన్ సెంటర్లను పెట్టుకుని జీవనోపాధిని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే.. ఆక్రమించుకుని ఇలా టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం చట్ట విరుద్ధమని, వెంటనే ఖాళీ చేయాలని పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ  దుకాణాల యజమానులు ఖాళీ చేయలేదు.

కంటోన్మెంట్ బోర్డు అధికారులు బుధవారం తెల్లవారుజామున జేసీబీలతో వెళ్లి టిఫిన్ సెంటర్లను, స్టాల్స్ను కూల్చేశారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి. సీఈఓ మధుకర్ నాయక్తో పాటు అధికారులు కూల్చివేతలను పర్యవేక్షించారు. సెప్టెంబర్ 17న  రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కంటోన్మెంట్కు రానున్నారు. జేబీఎస్ పక్కనే ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ, పార్కును ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో జేబీఎస్ పరిసరాల్లో ఆక్రమణలపై అధికారులు దృష్టి పెట్టారు.