గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇండ్లు

గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇండ్లు
  • పాత వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తాం
  • కంటోన్మెంట్​ ఎమ్మెల్యే శ్రీగణేశ్ హామీ

 పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని గంగయ్య బస్తీలో శిథిలావస్థకు చేరిన పాత ఇండ్ల స్థానంలో కొత్తగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ఎమ్మెల్యే శ్రీగణేశ్ హామీ ఇచ్చారు. స్థానికుల విజ్ఞప్తితో సోమవారం తిరుమలగిరి తహసీల్దార్ బిక్షపతితో కలిసి బస్తీలో పర్యటించారు. 35 ఏండ్ల కింద ప్రభుత్వం నిర్మించిన ఈ ఇండ్లు ప్రస్తుతం ప్రమాదకరంగా మారాయని, బస్తీ వాసులందరూ ఏకగ్రీవంగా ఇండ్ల కూల్చివేతకు, పునర్నిర్మాణానికి అంగీకరిస్తే వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి పనులు ప్రారంభిస్తామన్నారు.

భూమిపూజ జరిగిన వెంటనే వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చొరవతో తమ ఏండ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సరిత, మురళీ ముదిరాజ్, జూలియస్ పాస్టర్ పాల్గొన్నారు.