హైదరాబాద్, వెలుగు: దేశంలో రగ్బీ ఆటను అభివృద్ధి చేసేందుకు ఐటీ కంపెనీ క్యాప్‌జెమిని ముందుకొచ్చింది. ఈ నెల 16 నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న 'హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ 2026' రెండో సీజన్‌కు అఫీషియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ భాగస్వామ్యం 2028 వరకు కొనసాగనుంది. ఈ ఏడాది లీగ్‌లో తొలిసారిగా మహిళల విభాగంలో 4 జట్లను (చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా) ప్రవేశపెట్టారు. పురుషుల విభాగంలో 6 జట్లు తలపడుతున్నాయి.
