నాలాలపై క్యాపింగ్ ఉత్తమాటే!

నాలాలపై క్యాపింగ్ ఉత్తమాటే!

రూ. 300 కోట్లతో నాలాలపై క్యాపింగ్ ఉత్తమాటే!

చిన్నారి మృతిచెంది 2 నెలలు

నేటికీ అమలు కాని కేటీఆర్​హామీ

ఆరేండ్ల నుంచీ మారని పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: ‘రూ.300 కోట్లతో ఓపెన్​ నాలాలపై క్యాపింగ్​ పనులు చేయిస్తం..’ 11 ఏళ్ల చిన్నారి సుమేధ నాలాలో పడి చనిపోయిన తర్వాత కేటీఆర్​ ఇచ్చిన హామీ ఇది. కానీ, రెండు నెలలవుతున్నా దాని ఊసే లేదు. పనులు మొదలే కాలేదు. రెండు మీటర్లకన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై క్యాపింగ్​ చేసే ప్లాన్​రెడీ చేయాలని, రెండు మీటర్ల కన్నా ఎక్కువుంటే నాలాల చుట్టూ ఫెన్సింగ్​ వేయాలని అధికారులను కేటీఆర్​ ఆదేశించినా.. అవి ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయి.

మూడేండ్ల నాటి పనులు.. ఇప్పటికీ కాలె

ఓపెన్​ నాలాలన బల్దియా అసలు పట్టించుకోవడం లేదు. వర్షాలు కురిసే సమయంలో ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం నాలాలు విస్తరిస్తాం.. వాటిపై క్యాపింగ్​చేస్తాం. చుట్టూ ఫెన్సింగ్​వేస్తామని చెబుతున్నారు. వర్షాలు తగ్గాక పట్టించుకోవడం మానేస్తున్నారు.  మూడేండ్ల క్రితం చేపట్టిన నాలాల విస్తరణ, జాలీల ఏర్పాటు పనులు ఇప్పటికీ 20% కూడా పూర్తి కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  2017లో వరదలు వచ్చిన సమయంలో సిటీలో 391 కిలోమీటర్ల మేజర్ నాలాల పునరుద్ధరణ కోసం రూ.230 కోట్లతో పనులు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ ఆ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. రెండు నెలల క్రితం నేరేడ్​మెట్​లో నాలాలో పడి సుమేధ మృతిచెందడంతో  రూ.300 కోట్లతో  నాలాలపై క్యాపింగ్​చేస్తామని కేటీఆర్​ ప్రకటించారు. ఆ ప్రాంతంలో మొక్కుబడిగా నాలాపై టెంపరరీ క్యాపింగ్​ఏర్పాటు చేశారు తప్ప.. వేరే నాలాలను పట్టించుకోలేదు.  సుమేధ ఘటన జరిగిన కొన్ని రోజులకే సరూర్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలాలో పడి ఓ వ్యక్తి  ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడే కొద్ది రోజుల తరువాత మరో వృద్ధురాలు మృతిచెందింది.

చెత్తా చెదారమూ తీస్తలె

గత ఆరేండ్లలో నాలాలు,  డ్రైనేజీలపై రూ.3,316 కోట్లు ఖర్చు చేసినట్టు బల్దియా లెక్కలు చెబుతున్నాయి. వరద నీటి కాలువలకే  రూ.589 కోట్లు ఖర్చు చేశారట. 2016లో నాలాలపై 12 వేల అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఉన్నాయని తేల్చిన జీహెచ్​ఎంసీ..  వీటిలో కీలకమైన 43 ప్రాంతాలను గుర్తించింది. దాదాపు 100 కిలోమీటర్ల మేర ఆక్రమణలను తొలగించడంతోపాటు రూ. 230 కోట్లతో 47 పనులు చేపట్టారు. అయినా నాలాల పరిస్థితి ఎక్కడిదక్కడే ఉంది. నాలాల్లో ఏడాదంతా పూడికతీత పనులు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా ఎక్కడి చెత్త, చెదారం, మట్టికుప్పలు అక్కడే ఉన్నాయి. బ్రిడ్జిల వద్ద నాలాలకు కనీసం ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉండడం లేదు. నగరంలో 2 సెంటీమీటర్ల   కన్నా ఎక్కువ వాన పడితే  ప్రతిసారీ మూసారాంబాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి మీదుగా రాకపోకలు ఆగిపోవాల్సిందే. అప్పులు చేసి ఫ్లైఓవర్లు, అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రోడ్లు వేశారు కానీ డ్రైనేజీ వ్యవస్థ గురించి పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

ఆలోచించి ఓటు వేయండి

నాలాల విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిలైంది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల నా కూతురుని పోగొట్టుకున్న. అందుకనే ఎన్నికలు వచ్చిన సమయంలో ఆలోచించి అభివృద్ధి చేసేవారికి ఓటు వేయాలి. నేరెడ్​మెట్​నాలాలో పడి నా కూతురు చనిపోయినా నేటికీ పర్మనెంట్​సొల్యూషన్​ తీసుకోలేదు. నా కూతురు చనిపోయిన సమయంలో మంత్రి, మేయర్​మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ కలిగించాయి.

– సుకన్య, సుమేధ తల్లి

కమిటీ లేయడమే.. పనులు చేస్తలేరు

2000 సంవత్సరంలోనూ హైదరాబాద్​లో వరదలు వచ్చాయి. ఆ టైంలో అప్పటి ప్రభుత్వం ముంపు నివారణ చర్యలపై అధ్యయనం కోసం కిర్లోస్కర్ కమిటీ వేసింది. 1,221 కిలోమీటర్ల మేర నాలాలు ఉన్నాయని, అందులో 390 కిలోమీటర్ల వరకు మేజర్ నాలాలపై దాదాపు 28 వేల ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయని పేర్కొంది. వెంటనే నాలాల విస్తరణ పనులు చేపట్టాలని సూచిస్తూ ఇందుకు సుమారు పదివేల కోట్లు ఖర్చవుతుందని తెలియజేసింది. అయితే, రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని అప్పటి ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టేసింది. అదే విధంగా 2007లో ఓయన్స్, ఆ తర్వాత జేఎన్టీయూ నివేదికలను సైతం పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2016లో రెవెన్యూ, జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ, ప్రభుత్వ విభాగాలతో డ్రోన్ల ద్వారా అధ్యయనం చేయించారు. అనంతరం రెండేళ్ల క్రితం ఇంజనీర్ల కమిటీ తక్షణం 12 వేల ఆక్రమణలు తొలగించాలని సూచించగా అందుకు ప్రభుత్వం సంసిద్ధత తెలియజేసింది. నాలా ఆక్రమణలు కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, మూసాపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చందానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కిళ్ల పరిధిలోని పశ్చిమ మండలంలో, బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుర నుంచి మలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట వరకు ఉన్న దక్షిణ మండలంలో అధికంగా ఉన్నాయి. బాగా కుంచించుకుపోయిన నాలాలను విస్తరించేందుకు అధికారులు మూడేళ్ల క్రితం 46 ప్యాకేజీల్లో పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు పూర్తయినవి 11 మాత్రమే.

For More News..

బస్తీ ఓటర్లపైనే కార్పొరేటర్ క్యాండిడేట్ల ఫోకస్

ఎన్నికల తర్వాత వరద సాయం డౌటే