జేఈఈ మెయిన్స్ 2026 షెడ్యూల్ విడుదలైంది. JEE మెయిన్స్ సెషన్ 1, సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. 2026 జనవరి 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్స్- సెషన్1 పరీక్షలు నిర్వహించనున్నారు. అదే విధంగా సెషన్ 2 పరీక్షలు 2026 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జరుగుతాయని ఎన్టీఏ ఆదివారం (అక్టోబర్ 19) ప్రకటన విడుదల చేసింది.
జేఈఈ మొదటి సెషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దరఖాస్తుల స్వీకరణ ఈనెల ( అక్టోబర్ ) లోనే ఉంటుంది. అలాగే జేఈఈ మెయిన్స్-2కు 2026 జనవరి చివరి వారం నుంచి దరఖాస్తులు. స్వీకరిస్తారు.
జేఈఈ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి ఎగ్జామ్ సెంటర్లను పెంచనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. అందుకోసం మరిన్ని సిటీల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
అర్హులైన అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, కేటగిరి సర్టిఫికెట్లను ముందే అప్ డేట్ చేసుకోవాలి. అభ్యర్థి సరైన పేరు, డేటాఫ్ బర్త్, తండ్రి పేరు, అడ్రస్ వంటి వివరాలను కరెక్టుగా అప్ డేట్ చేసుకోవాలి. వికలాంగులు కూడా తమ డిసెబిలిటీ వివరాలను అప్ డేట్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. పూర్తి సమాచారం కోసం అభ్యర్తులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
