ఇల్లే పేకాట స్థావరం.. మాజీ ఎమ్మెల్యేతో పాటు13 మంది అరెస్టు.. ఎంత డబ్బు పట్టుబడిందంటే..

ఇల్లే పేకాట స్థావరం.. మాజీ ఎమ్మెల్యేతో పాటు13 మంది అరెస్టు.. ఎంత డబ్బు పట్టుబడిందంటే..

ఆయనో మాజీ శాసన సభ్యులు. ప్రజా ప్రతినిధిగా చట్టాల రూపకల్పనలో, పరిపాలనలో పాలుపంచుకున్న నాయకుడు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన పొజిషన్ లో ఉండి కూడా.. ఇళ్లునే పేకాట స్థావరంగా మార్చుకుని జూదంలో పాల్గొంటూ.. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ వార్త ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

వివరాల్లోకి వరంగల్ లో మాజీ ఎమ్మెల్యే దోనపూడి రమేష్ బాబు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే నివాసంపై  టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరపు దాడి చేశారు. గత కొన్నాళ్లుగా జూదం ఆడుతున్నారన్న సమచారంతో దాడి చేసిన పోలీసులకు.. చివరిక మాజీ ప్రజాప్రతినిధే పేకాటు ఆడుతుండటం ఆశ్చర్యానికి గురిచేసింది. 

కొత్తవాడలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంట్లో ఆయనతో పాటు  మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరినుంచి 3 లక్షల 68 వేల 530 రూపాయల నగదు,సెల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డులు, ప్లాస్టిక్ కాయిన్స్  స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

పేకాటలో కరెన్సీ కి బదులుగా కాయిన్స్ (ప్లాస్టిక్) తో పేకాట ఆడుతూ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.