IND vs AUS: విదేశాల్లో ఆడించకపోతే సెలక్ట్ చేయడం ఎందుకు..? మ్యాచ్ విన్నర్‌ను మళ్ళీ పక్కన పెట్టిన టీమిండియా

IND vs AUS: విదేశాల్లో ఆడించకపోతే సెలక్ట్ చేయడం ఎందుకు..? మ్యాచ్ విన్నర్‌ను మళ్ళీ పక్కన పెట్టిన టీమిండియా

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 గమనిస్తే స్పెషలిస్ట్ స్పిన్నర్ లేడు. ఇండియా స్క్వాడ్ లో ఎంపికైన ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో ఖచ్చితంగా స్థానం దక్కుతుందనుకుంటే జట్టు యాజమాన్యం అతడిని పక్కన పెట్టింది. చైనామన్ స్పిన్ తో మ్యాచ్ విన్నర్ గా పేరొందిన కుల్దీప్ ని పక్కన పెట్టడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కుల్దీప్ స్థానంలో ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ కి ఛాన్స్ దక్కింది.   

అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపించుకున్నాడు:

కుల్దీప్ యాదవ్ చేతికి ఎప్పుడు బంతి అందించిన నిరాశపర్చడు. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అద్భుతంగా రాణించి మ్యాచ్ మలుపు తిప్పిన ఈ కుల్దీప్.. ఇటీవలే ఆసియా కప్ లో తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇలా ఫార్మాట్ ఏదైనా ప్రతి సిరీస్ లో కుల్దీప్ తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. అయితే విదేశీ సిరీస్ లకు వచ్చేసరికి ఈ మిస్టర్ స్పిన్నర్ ను టీమిండియా పక్కన పెట్టేస్తుంది.

ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం దక్కించుకోలేకేపోయిన కుల్దీప్.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలోనూ బెంచ్ కు పరిమితమయ్యాడు. విదేశీ గడ్డ అంటే కుల్దీప్ అవసరం లేదంటూ ఛాన్స్ ఇవ్వడం లేదు. స్క్వాడ్ లో ఎంపిక చేస్తున్నా ప్రతి మ్యాచ్ లో బెంచ్ మీద కూర్చోబెడుతుండడంతో అతని కాన్ఫిడెంట్ పోయే అవకాశం ఉంది. సుందర్ రాణించడంతో కుల్దీప్ పై ఎలాంటి ప్రశ్నలు రావడం లేదు. 

ఈ మ్యాచ్ లో ఇండియా ముగ్గురు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతుంది. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్ ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డే కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తన ప్రయాణాన్ని  ప్రారంభించనున్నాడు. ఏడు నెలల గ్యాప్‌‌ తర్వాత  లెజెండ్స్ రోహిత్, కోహ్లీ (రోకో) తిరిగి ఇండియా జెర్సీ వేసుకొని గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టడం ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జోష్ తెచ్చింది.

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): 

ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్