గుండెను కాపాడుకునేందుకు లాంగ్ వాక్ అవసరం లేదు.. ఈ సింపుల్ వ్యాయామం చాలు.. మీరూ ట్రై చేయండి !

గుండెను కాపాడుకునేందుకు లాంగ్ వాక్ అవసరం లేదు.. ఈ సింపుల్ వ్యాయామం చాలు.. మీరూ ట్రై చేయండి !

సిటీ లైఫ్ లో గుండె జబ్బుల బారిన పడుతున్నవాళ్లు.. ఒబేసిటీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్లు పెరిగిపోతున్నారు. అందుకు తీసుకునే ఆహారంతో పాటు చేస్తున్న జాబ్.. అలవాట్లే కారణం. డెస్కులలో గంటల తరబడి కూర్చుని జాబ్ చేసేవాళ్లు.. ఇంట్లో టీవీ, మొబైల్ చూస్తూ చాలా సేపు కూర్చుని ఉండే వాళ్లకు ఈ రిస్క్ మరింతగా ఉంటుందని ఇప్పటికే ఎన్నో స్టడీస్ వెల్లడించాయి. 

ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం లాంగ్ వాక్ చేస్తే సరిపోతుందిలే అని చాలా మంది భావిస్తుంటారు. కొందరు డాక్టర్లు కూడా అలాంటి సజెషన్స్ చేస్తుండటంతో మార్నింగ్ లేదా ఈవినింగ్ వాక్ చేసి.. హమ్మయ్య నా హార్ట్ సేఫ్ అనుకునేలా రిలాక్స్ అవుతుంటారు. కానీ లాంగ్ వాక్ చేసినా కూడా గ్యారెంటీ ఇవ్వలేమని అపోలో హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ అంటున్నారు. 

గుండెను కాపాడుకునేందుకు గేమ్ ఛేంజర్ లాంటి ఒక చిన్న ఎక్ససైజ్ చేస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. కూర్చున్న దగ్గరే.. చైర్స్ పక్కనే సింపుల్ ఎక్ససైజ్ చేసి గుండెకు కావాల్సినంత బలం, ఒబేసిటీ తగ్గించుకునే శక్తిని పొందవచ్చునని తెలిపారు. ఆ ఎక్ససైజ్ ఏంటంటే.. స్క్వాట్స్.. అంటే కూర్చుని లేచి నిలబడే సింపుల్ ఎక్ససైజ్. ఉద్యోగం పూర్తైన తర్వాత లాంగ్ వర్కౌట్ చేసేకంటే.. మధ్య మధ్యలో ఇది చేస్తే బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోవడమే కాకుండా.. గుండెను పదిలపర్చుకోవచ్చునని చెప్తున్నారు. 

డెస్క్ జాబ్ చేసేవాళ్లు లేదా ఎక్కువ సేపు కూర్చుని ఉండేవాళ్లు.. ప్రతి 45  నిమిషాలకు పది (10) స్క్వాట్స్ చేయాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇలా చేయడం వలన 30 నిమిషాలు నడిచిన దానికంటే ఎఫెక్టివ్ గా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతున్నట్లు తెలిపారు. చాలా సేపు కూర్చుని ఉండే వారిలో ఒబేసిటీ, డయాబెటిస్, గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉందని.. అందుకోసం ఈ ఎక్ససైజ్ చేయాలని సూచించారు. 

ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారు ప్రతి 45 నిమిషాలకు స్క్వాట్స్ లేదా మూడు నిమిషాలు వాకింగ్ చేస్తే బాడీ యాక్టివ్ గా ఉంటుందని.. మెటబాలిజం సరిగ్గా పనిచేస్తుందని తెలిపారు. పొద్దున్నో సాయంత్రమో చేసే కసరత్తుల వలన అనుకున్నంత ఫలితం ఉండదని తెలిపారు. 

అయితె డెస్క్ జాబ్ లో పనిచేసే వారికి ప్రతి 45 నిమిషాలకు వాకింగ్ వెళ్లే వెసులు బాటు అన్ని ఆఫీసులల్లో ఉండకపోవచ్చు. అలాంటి సిచువేషన్ లో  ఓ పది స్క్వాట్స్ కొట్టండి. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి.