
క్రికెట్ లో గంటకు 150 కి. మీ వేగంతో వేసే బంతులను చూశాం. రికార్డ్ స్థాయిలో 160 కి.మీ వేగంతో వేసే బంతులను వేశారని విన్నాం. అయితే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఏకంగా 176.5 కి.మీ వేగంతో బంతి వేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆదివారం (అక్టోబర్ 19) ప్రారంభమైన తొలి వన్డేలో రోహిత్ కు స్టార్క్ విసిరిన తొలి బంతి 176.5 కి.మీ వేగంతో చూపించడం వైరల్ అవుతోంది. ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ స్కోర్ కార్డులో చూపించడం షాకింగ్ కు గురి చేస్తోంది. క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ ఇప్పటివరకు అత్యధికంగా 161 కి. మీ వేగంతో బంతిని విసిరాడు.
ఒకవేళ స్టార్క్ డెలివరీగా పొరపాటున అలా చూపించారా.. లేకపోతే నిజంగా విసిరాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇది సాంకేతిక లోపం కారణంగానే జరిగినట్టు అర్ధమవుతోంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే స్టార్క్ దుమ్ములేపుతున్నాడు. తన తొలి స్పెల్ లో టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టాడు. క్రీజ్ లో ఉన్నంతవరకు గిల్, కోహ్లిలను ఇబ్బంది పెట్టిన ఈ ఆసీస్ స్పీడ్ స్టార్.. కోహ్లీ వికెట్ తీసుకున్నాడు. 7 బంతులాడిన కోహ్లీ స్టార్క్ బౌలింగ్ లో పాయింట్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓవరాల్ గా తొలి స్పెల్ లో 5 ఓవర్లు వేసిన స్టార్క్.. ఒక మైడీన్ ఓవర్ తో 20 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
►ALSO READ | IND vs AUS: 25 పరుగులకే టాపార్డర్ పెవిలియన్కు.. కోహ్లీ డకౌట్, రోహిత్ సింగిల్ డిజిట్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కాసేపు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 49 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం 11.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. ఈ దశలో మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. క్రీజ్ లో శ్రేయాస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, హేజల్ వుడ్, ఎల్లిస్ లకు తలో వికెట్ లభించింది. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన రోహిత్ 14 బంతుల్లో 8 పరుగులకే చేసి ఔటయ్యాడు. హేజల్ వుడ్ బౌలింగ్ లో స్లిప్ లి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఎల్లిస్ తన తొలి ఓవర్లోనే గిల్ ను ఔట్ చేసి ఇండియాను కష్టాల్లో పడేశాడు.