Womens World Cup: చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్.. వరల్డ్ కప్లో వెయ్యి రన్స్ చేసిన రెండో ప్లేయర్గా రికార్డ్

Womens World Cup: చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్.. వరల్డ్ కప్లో వెయ్యి రన్స్ చేసిన రెండో ప్లేయర్గా రికార్డ్

ఇండియా విమెన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 19) ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేయడంతో పాటు.. మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. విమెన్స్ వరల్డ్ కప్ లో ఇండియా నుంచి వెయ్యి రన్స్ చేసిన రెండో ప్లేయర్ గా చరిత్ర లిఖించింది. మిథాలీ రాజ్ తర్వాత ఐసీసీ విమెన్ వరల్డ్ కప్స్ లో వెయ్యి రన్స్ రెండో బ్యాట్స్ విమెన్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. 

ఇండియా నుంచి మిథాలీ రాజ్ 1321 రన్స్ తో తొలి విమెన్ ప్లేయర్ గా ఫస్ట్ ప్లేస్ లోఉంది. వెయ్యి పరుగుల మైలురాయి చేరుకుంది హర్మన్ ప్రీత్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 70 రన్స్ చేసిన హర్మాన్.. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి పరుగులు చేసిన ప్లేయర్లలో 7వ స్థానంలో నిలిచింది. 

1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్లు:

  •  డెబ్బీ హాక్లీ (NZ-W) - 1501
  • మిథాలీ రాజ్ (IND-W) - 1321 
  • జానెట్ బ్రిటిన్ (ENG-W) - 1299 
  • షార్లెట్ ఎడ్వర్డ్స్ (ENG-W) - 1231
  • సుజీ బేట్స్ (NZ-W) - 1208 
  •  బెలిండా క్లార్క్ (AUS-W) - 1151
  • హర్మన్‌ప్రీత్ కౌర్ (IND-W) - 1021 

ఆదివారం (అక్టోబర్ 19) ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 289 పరుగుల టార్గెట్ ఛేదనలో భాగంగా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన హర్మన్.. 31 వ ఓవర్ లో సివర్ బ్రంట్ బౌలింగ్ లో వెనుదిరిగింది. స్మృతి మంధనతో కలిసి 125 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేసి.. గెలుపు కావాల్సిన శుభారంభాన్నిచింది. వండేల్లో హర్మాన్ కు ఇది 21 వ హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్ లో స్మృతి మందన 88 రన్స్ తర్వా ఔటయ్యింది. 

ఇక ఇండోర్ హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం (అక్టోబర్ 19) జరుగుతున్న మ్యాచ్ లో..  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఇండియాకు 289 పరుగులు టార్గెట్ ను ఇచ్చింది. 300వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న హీథర్ నైట్ సూపర్ సెంచరీతో ఇంగ్లండ్ ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లింది. కేవలం 91 బాల్స్ లో 109 రన్స్ (15 ఫోర్లు, ఒక సిక్స్) చేసి వండేల్లో మూడో సెంచరీ నమోదు చేసుకుంది. ఇక ఓపెనర్ అమీ జోన్స్ 68 బాల్స్ 56 రన్స్ (8 బౌండరీలు) తో మంచి పాట్నర్షిప్ ఇచ్చింది.