
రైళ్లలో ఫుడ్ క్యాటరింగ్ కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా IRCTC ని ఏర్పాటు చేసినప్పటికీ.. ఇంకా హైజీనిక్ ఫుడ్ విషయంలో ప్యాసెంజర్ల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. రైళ్లలో ఆర్డర్ చేసుకుని తినాలంటే ప్యాసెంజర్లు ఇప్పటికీ సంకోచిస్తూనే ఉంటారు. అలాంటిది.. ఇటీవల అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ లో జరిగిన ఇన్సిడెంట్ అందరినీ షాకింగ్ కు గురిచేసింది. రైల్వే క్యాటరింగ్ వ్యవస్థపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమైంది.
అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ (16601) లో క్యాటరింగ్ సిబ్బంది ఫుడ్ కంటైనర్లను వాష్ బేసిన్ లో క్లీన్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. అప్పటికే వాడిన సిల్వర్ ఫుడ్ కంటైనర్స్ ను మళ్లీ కడిగి పేర్చుతున్న వీడియో ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. ఇది సిగ్గుమాలిన చర్య. ప్రయాణికుల నుంచి ఛార్జీలు ఫుల్లుగా వసూలు చేస్తారు.. కానీ ఇలాంటి సిగ్గు మాలిన చర్యలకు పాల్పడతారా..? అంటూ రైల్వే మినిస్టర్ ను కోట్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసింది కాంగ్రెస్.
ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వాడిపడేసిన కంటైనర్లలో మళ్లీ ఫుడ్ సప్లై చేస్తున్నారా..? అందుకే రైల్వేలో ఫుడ్ తినటానికి ధైర్యం చేయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్యాటరింగ్ సిబ్బంది అహంకారం, పొగరుబోతుతనం, మర్యాద లేని స్టాఫ్ .. అందుకే రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేయడం మానేశాను. ఎంత ఆకలేసినా.. రైలెక్కే ముందు ఏదైనా మంచి హోటల్ లో తింటా లేదంటే దిగిన తర్వాత ఎక్కడైనా తింట కానీ.. రైళ్లలో కష్టం. ఇలా వాడిపడేసినవి మళ్లీ వాడటం చాలా పెద్ద తప్పు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
IRCTC స్పందనేంటి..?
ఈ విష్యూ సోషల్ మీడియలో వైరల్ అవ్వటంతో రైల్యే క్యాటరింగ్ సంస్థ ప్రకటించింది. హైజీనిక్ విషయంలో ఎక్కడా తగ్గమని చెప్పింది. స్క్రాప్ (చెత్త) ఏరుకునే వాళ్లు వివిధ స్టేషన్లలో రైళ్లలోకి ఎక్కి.. వాటిని తీసుకుంటుంటారు. కొందరు బేసిన్ లలోనే కడిగి తీసుకెళ్తున్నట్లుంది. వాళ్లకు ఇచ్చేందుకు వాటిని క్లీన్ చేస్తున్నట్లుంది అని పేర్కొంది. ఇది ఇప్పటి వరకు జరగలేదని.. వాడిన ప్లేట్లను వినియోగించే పరిస్థితి లేదని తెలిపింది. ప్యాసెంజర్లకు వినియోగించిన.. లేదా అమ్ముడుపోని ఫుడ్ ను మళ్లీ సర్వ్ చేయడం కూడా ఉండదని క్లారిటీ ఇచ్చింది.
ప్రయాణికులకు సర్వ్ చేస్తున్న ఫుడ్ ఐటెమ్స్.. ఫ్రెష్ గా ప్రిపేర్ చేసినవి.. ఐఆర్సీటీసీ నిర్ధారించిన కిచెన్ బాస్కెట్స్ నుంచే వాటిని సప్లై చేస్తుంటారు. స్వచ్ఛత, శుభ్రత విషయంలో ఎక్కడా రాజీపడేదిలేదని ప్రకటన విడుదల చేసింది.
रील मंत्री जी, यही है आपकी सुविधा 👇🏼
— Congress (@INCIndia) October 19, 2025
ये वीडियो अमृत भारत एक्सप्रेस (16601) का है- जहां गंदे डिस्पोजेबल फूड कंटेनर्स को धोकर दोबारा खाना देने के लिए रखा जा रहा है।
जनता से टिकट पर फुल वसूली की जाती है, लेकिन दूसरी ओर ये घटिया हरकत।
शर्म आनी चाहिए। pic.twitter.com/xePX8CKc7O