
చెన్నై: దీపావళి పండుగ వేళ తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. చెన్నై సమీపంలోని పట్టాభిరామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి ఇంట్లోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దీపావళి సందర్భంగా ఇంట్లో బాణా సంచా అమ్ముతుండగా ప్రమాదవశాత్తూ ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పేలుడుకి గల కారణాలు ఏంటన్నది ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. పండుగా వేళ ఒకేసారి నలుగురు చనిపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.