త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మందాన.. అఫిషియల్‎గా ప్రకటించిన కాబోయే భర్త

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మందాన.. అఫిషియల్‎గా ప్రకటించిన కాబోయే భర్త

భోపాల్: టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే భర్తనే స్వయంగా వెల్లడించారు. త్వరలోనే తాను, స్మృతి మందాన పెళ్లి చేసుకోబోతున్నామని అఫిషియల్‎గా ప్రకటించాడు. 

కాగా, స్టార్ క్రికెటర్ స్మృతి మందాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ రిలేషన్ షిప్‎లో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే.. తమ బంధాన్ని స్మృతి కానీ పలాష్ కానీ అధికారికంగా ఎప్పుడు ధృవీకరించలేదు. ఈ క్రమంలో స్మృతి మందానతో రిలేషన్ షిప్, పెళ్లి గురించి తొలిసారి అఫిషియల్‎గా కన్ఫామ్ చేశాడు పలాష్ ముచ్చల్. స్మృతి తాను రిలేషన్‎లో ఉన్నది వాస్తవమేనని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని కుండబద్దలు కొట్టాడు. 

మధ్యప్రదేశ్‎లోని ఇండోర్‎కు చెందిన పలాష్ ముచ్చల్ ఆదివారం (అక్టోబర్ 19) స్టేట్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా స్మృతితో రిలేషన్ షిప్ గురించి పలాష్‎కు ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు పలాష్ సమాధానమిస్తూ.. ‘‘స్మృతి మందాన త్వరలో ఇండోర్‌కు కోడలు అవుతుంది.. నేను చెప్పదలచుకున్నది ఇంతే’’ అని ఫస్ట్ టైమ్ తమ రిలేషన్ షిప్‎ గురించి నోరువిప్పాడు. పలాష్ ముచ్చల్ ప్రకటనతో స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని విషయం స్పష్టమైంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్‎తో స్మృతి బిజీ బిజీగా గడుపుతోంది. వన్డే వరల్డ్ కప్‎లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 19) ఇండోర్‏లోని హోల్కర్ స్టేడియం ఇంగ్లాండ్, ఇండియా తలపడనున్నాయి. ఈ మ్యాచుకు ముందు తన స్వస్థలం ఇండోర్‏లో మ్యాచ్ ఆడబోతున్న స్మృతికి పలాష్ శుభాకాంక్షలు తెలిపారు.