
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వన్డేల్లో మరోసారి బ్యాటింగ్ ఆర్డర్ మారింది. వన్డేల్లో రెగ్యులర్ గా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే రాహుల్ ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న తొలి వన్డేలో ఆరో స్థానంలో బరిలోకి దిగాడు. ఆదివారం (అక్టోబర్ 19) పెర్త్ వేదికగా ఇండియాతో ప్రారంభమైన మ్యాచ్ లో గిల్ ఔటైన తర్వాత రాహుల్ వస్తదనుకుంటే అక్షర్ పటేల్ బ్యాటింగ్ కు దిగాడు. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. రాహుల్ లాంటి అద్భుత ప్రతిభ గల ఆటగాడిని ఆరో స్థానంలో బ్యాటింగ్ కు పంపడంపై హెడ్ కోచ్ గంభీర్ తో పాటు జట్టు యాజమాన్యంపై అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి.
రాహుల్ కంటే ముందు అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది. జట్టు విజయాల కోసం రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చి అతని కెరీర్ ను నాశనం చేస్తున్నారని నెటిజన్స్ సైతం గంభీర్ పై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ గంభీర్ మాత్రం తన రూట్ మార్చుకోవడం లేదు. ఐదో స్థానంలో అక్షర్ పటేల్ నే కొనసాగిస్తున్నాడు. ఒకవేళ టీమిండియాకు మంచి ఆరంభం లభిస్తే రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చేవాడని.. త్వరగా వికెట్లు పడడం కారణంగానే అక్షర్ ను పంపారనే వాదనలు కూడా ఉన్నాయి. మరి ఆసీస్ పై చేసిన ఈ ప్రయోగం ఎలా ఉంటుందో చూడాలి.
వన్డేల్లో రాహుల్ కు ఐదో స్థానంలో సూపర్ రికార్డ్ ఉంది.50 ఓవర్ల ఫార్మాట్ లో ఐదో స్థానంలో 50కి పైగా యావరేజ్ ఉంది. అయితే ఏడాది కాలంగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ నుండి అతను ఒక స్థానం దిగజారి ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరో స్థానంలో కూడా రాహుల్ అదరగొడుతున్నాడు. ఒత్తిడి సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. ఇటీవలే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయంగా 42 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియాకు ఘోరమైన ఆరంభం లభించింది. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచారు. కోహ్లీ డకౌట్ అయితే.. రోహిత్ 8 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. తొలిసారి వన్డే కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన గిల్ కూడా 10 పరుగులకే ఔటవ్వడంతో ఇండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం 16 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజ్ లో రాహుల్ (2), అక్షర్ పటేల్ (13) ఉన్నారు.