వారఫలాలు: అక్టోబర్ 19 నుంచి 25 వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.. !

వారఫలాలు: అక్టోబర్ 19 నుంచి 25  వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.. !

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( అక్టోబర్19  నుంచి   25  వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం..

మేషరాశి: ఈ రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. గతంలో కంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా ఖర్చులు  పెరుగుతాయి.ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది.  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు దూరంగా ఉండండి. 

వృషభరాశి :  ఈ రాశి కి చెందిన ఉద్యోగస్తులు ఈ వారంలో శుభవార్త వింటారు.  వృత్తి..వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  గతంలో ఉన్న ఫైనాన్స్​ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.  నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు.  స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. 

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది.  ఉద్యోగులకు పనిభారం పెరిగినా సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి.. వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి.  చేతి వృత్తుల వారికి  వారం మధ్యలో అనుకోకుండా ఆర్డర్లు పెరుగుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి.  డబ్బు పొదుపు చేస్తారు. . కుటుంబ వ్యవహారాలపై శ్రద్ద చూపాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది.  కొత్తగా వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇప్పటివరకు ఉన్న కుటుంబసభ్యుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. వారం చివర్లో పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.  వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.

సింహరాశి:  ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులు నెరవేరుతాయి.  కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.  భూ లావాదేవీల వ్యవహారంలో సానుకూల ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు ఆశించన జాబ్​ లభిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి.  వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు కూడా పరవాలేదనిపిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.  ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. 

కన్యారాశి: ఈ రాశి వారికి ఈ వారంలో  మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి.  కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.  వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.  ప్రేమ వ్యవహారాలు కాస్తంత ఇబ్బంది పెడతాయి. 

తులారాశి: ఈ రాశి వారికి ఈవారంలో  ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.  వృత్తి, వ్యాపారాల్లో ఏ మార్పు తలపెట్టినా లాభదాయకంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు  పదోన్నతి కలిగే  అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతాయి.  నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలి స్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. 

వృశ్చికరాశి:ఈ రాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. వృత్తి.. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు జాబ్​ ఆఫర్లు వస్తాయి. వృత్తి జీవితంలో తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.  ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కరంగా సాగిపోతాయి. 

ధనుస్సురాశి: ఈ వారం ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.  వివాదాలకు దూరంగా ఉండండి.  ఇతరులతో సంభాషించే విషయంలో జాగ్రత్తలు పాటించండి. పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది.  శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకు .. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

మకరరాశి:  ఈ రాశి వారికి ఈ వారం అనుకోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు.  కొత్త పెట్టుబడుల విషయంలోఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు.  విద్యార్థుల విషయంలో కేరీర్ పరంగా నిర్ణయాలు తీసుకుంటారు.  ఆర్థిక విషయాల్లో మిశ్రమఫలితాలుంటాయి.  వారం మధ్యలో నుంచి కొంత ఊరట లభిస్తుంది. స్థిర ఆస్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారంలో  వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా సాగిపోతాయి.  ప్రేమ వ్యవహారాలు పరవా లేదనిపిస్తాయి.

మీనరాశి: ఈ రాశి వారు ఈ వారం బిజీబిజీగా గడుపుతారు. వ్యాపారాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.  కుటుంబ జీవితం కూడా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.