
విమెన్స్ వరల్డ్ కప్ లో ఇండియా తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్. పక్కా గెలవాల్సిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ దీప్తి శర్మ మాయాజాలంతో నాలుగు వికెట్లు తీసుకుని.. ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఊపుమీదున్న ఇంగ్లాండ్ ను 50 ఓవర్లకు 288 పరుగులకు కట్టడి చేయగింది టీమిండియా.
ఆదివారం (అక్టోబర్ 19) ఇండోర్ హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఇండియాకు 289 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. 300వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న హీథర్ నైట్ సూపర్ సెంచరీతో ఇంగ్లండ్ ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లింది. కేవలం 91 బాల్స్ లో 109 రన్స్ (15 ఫోర్లు, ఒక సిక్స్) చేసి వండేల్లో మూడో సెంచరీ నమోదు చేసుకుంది. ఇక ఓపెనర్ అమీ జోన్స్ 68 బాల్స్ 56 రన్స్ (8 బౌండరీలు) తో మంచి పాట్నర్షిప్ ఇచ్చింది.
ఊపుమీదున్న ఇంగ్లండ్ ప్లేయర్లను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. 45వ ఓవర్ వరకు మూడు వికెట్లు కోల్పోయి 249 రన్స్ చేసిన ఇంగ్లండ్.. చివరి ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోవడం విశేషం. 300 స్కోర్ క్రాస్ అవుతుందనుకున్న తరుణంలో.. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ వేసి వికెట్లు తీస్తూ స్కోర్ ను కట్టడి చేశారు.
క్లోజింగ్ స్పెల్ లో దీప్తి శర్మ అద్భుతం చేసింది. ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు వికెట్లు తీసిన దీప్తి.. వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకుంది. ఆమెకు తోడు శ్రీచరణి 2 వికెట్లతో సపోర్ట్ చేయడంతో నాలుగు సార్లు ఛాంపియన్ అయిన ఇంగ్లండ్ ను 300 స్కోర్ లోపే కట్టడి చేయగలిగారు.
వండేల్లో ఇంగ్లండ్ కు ఇది అత్యధిక ఓపెనింగ్ ఇన్నింగ్స్ టోటల్. గతంలో 2013 వరల్డ్ కప్ లో 272/8 స్కోరును బీట్ చేశారు. విమెన్స్ వరల్డ్ కప్ లో ఇండియాపై అత్యధిక స్కోర్ కావడం విశేషం. 2013 లో శ్రీలంక 282/5 స్కోర్ చేసింది.