చేవెళ్లలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి

చేవెళ్లలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి

చేవెళ్ల , వెలుగు: చేవెళ్ల మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లగూడ గ్రామానికి చెందిన గొంగళ్ల శ్రీరాం (30) గురువారం రాత్రి తన ఎఫ్​జెడ్ బైక్​పై ఎన్కేపల్లి నుంచి ఈర్లపల్లి వైపు వెళ్తుండగా, వెనుక నుంచి ఓవర్​స్పీడ్​తో బాలెనో కారు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన కారు.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఫకీర్‌‌ మహబూబ్​షా(45)ను కూడా ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీరాంను చికిత్స నిమిత్తం నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని వికారాబాద్ జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన కృష్ణయ్యగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.