నార్సింగీలో కారు బిభత్సం.. రోడ్డు పై బైక్ ను ఈడ్చుకెళ్లింది..

నార్సింగీలో కారు బిభత్సం.. రోడ్డు పై బైక్ ను ఈడ్చుకెళ్లింది..

హైదరాబాద్ నార్సింగీలో కారు బీభత్సం సృష్టించింది. మై హోమ్ అవతార్ సమీపంలో మోటర్ సైకిల్ ను వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కారు ఆగకుండా కొద్ది దూరం బైక్ ను ఈడ్చుకుంటూ వెళ్లింది. మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ కారు వదిలి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.