హైదరాబాద్ శివారు శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. గుర్తుపట్టలేనంతగా మృతదేహం కాలిపోయింది.
శామీర్ పేట్ నుంచి కీసరకు వెళుతుండగా లియోనియో రెస్టారెంట్ దగ్గర ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా కారులో మంటలు ఎగిసిపడడంతో డ్రైవర్ కారు నుంచి బయటకు రాలేకపోయాడు. దీంతో అతనితో పాటు కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు. మృతుడు ఎవరు ఏంటనే వివరాలు సేకరిస్తున్నారు.
