
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కార్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. శుక్రవారం బంజారాహిల్స్ లో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టగా.. శనివారం పాతబస్తీలో ఇంటి ముందు ఉన్న బాలుడిని రివర్స్ లో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ బాలుడు క్షేమంగా బయటపడగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా నిలోఫర్ ఆస్పత్రి దగ్గర మరో కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న వాహనాలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7 వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ అశ్విన్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.