కరెంట్ స్తంభాన్ని ఢికొన్న కారు.. ఒకరికి తీవ్ర గాయాలు

కరెంట్ స్తంభాన్ని ఢికొన్న కారు.. ఒకరికి తీవ్ర గాయాలు

కూకట్ పల్లి KPHB పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో (ఫిబ్రవరి 29) కారు బీభత్సం సృష్టించింది. ప్రగతి నగర్ చెరువు దగ్గర అతివేగంగా దూసుకొచ్చిన కారు... కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలయి వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కరెంట్ పోల్ కు ఢికొనడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రగతి నగర్ నుంచి జేఎన్టీయూ వైపు వెళుతుంగా ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మితిమీరిన వేగం, డ్రైవర్ నిద్ర మత్తులో జారు కోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.