
- సెకండ్ ప్లేస్‌కు అశ్విన్
దుబాయ్: ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో సెంచరీతో అదరగొట్టిన ఇండియా కీపర్ రిషబ్ పంత్ ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకెళ్లాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్ దక్కించుకున్నాడు. బ్యాట్స్మెన్ కేటగిరీలో ఏకంగా ఏడు స్థానాలు మెరుగైన ఈ యంగ్ ప్లేయర్.. తోటి ఆటగాడు రోహిత్ శర్మ, న్యూజిలాండ్ క్రికెటర్ హెన్రీ నికోల్స్తో కలిసి ఏడో ర్యాంక్ పంచుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 39 ప్లేస్లు ఎగబాకి 62వ స్థానం సాధించాడు. ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో ర్యాంక్ నిలబెట్టుకోగా.. పుజారా పది నుంచి 13వ ప్లేస్కు పడిపోయాడు. ఇంగ్లండ్తో సిరీస్లో అదరగొట్టిన అశ్విన్ బౌలర్ల ర్యాంకింగ్స్లో మూడు నుంచి రెండో ప్లేస్ సాధించాడు. అక్షర్ పటేల్ ఎనిమిది ర్యాంక్లు మెరుగై 30వ ప్లేస్లోకి వచ్చాడు.