
కశ్మీర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. జమ్ము కశ్మీర్ లో ఏం జరుగుతుందో అంతర్జాతీయ మీడియా చూపించాలన్నారు. కశ్మీర్ ను కాపాడడం మన ప్రథమ కర్తవ్యం అన్న దిగ్విజయ్..కశ్మీర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మోడీ, అమిత్ షా, ధోవల్ లను కోరుతున్నట్లు చెప్పారు. లేకపోతే కశ్మీర్ ను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నెహ్రు పెద్ద క్రిమినల్ అన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వ్యాఖ్యలపై దిగ్విజయ్ స్పందించారు . నెహ్రు కాలి గోటికి కూడా చౌహన్ సరిపోరని విమర్శించారు.