పత్తాలేని డాక్టర్, సిబ్బంది : హాస్పిటల్​ గేటు ముందే డెలివరీ

పత్తాలేని డాక్టర్, సిబ్బంది : హాస్పిటల్​ గేటు ముందే డెలివరీ

పెద్దకొత్తపల్లి(నాగర్​కర్నూల్​), వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ గర్భినీ పీహెచ్ సీ గేట్ దగ్గరే ప్రసవించింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన గర్భిణీ భీమమ్మకు మంగలవారం సాయంత్రం నొప్పులు రావడంతో  108 కు ఫోన్​ చేస్తే వారు స్పందించలేదు. దీంతో భర్త మల్లేశ్ తో కలిసి నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుంది.

అదే సమయంలో భీమమ్మకు నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి మెయిన్​ డోర్​ ముందరే ప్రసవించింది. ఆ సమయంలో ఆస్పత్రిలో పనిచేసే హెల్త్ అసిస్టెంట్​ చెన్నయ్య ఒక్కడే డ్యూటీలో ఉన్నట్లు సమాచారం. ప్రసవానంతరం మండల కేంద్రంలో ఉన్న ఆర్​ఎంపీని పిలిపించి ప్రాథమిక చికిత్స అందించారు. తల్లి,శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

see also: ఫీజు వసూల్ చేసి.. ఇంటర్ బోర్డుకు కట్టని కాలేజీ