న్యూఢిల్లీ: ఏసీల తయారీ సంస్థ క్యారియర్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో రూ.వెయ్యి కోట్లతో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 39 ఎకరాల్లో నిర్మించే ఈ ప్లాంట్ ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా, రెండు వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
తక్కువ విద్యుత్ వినియోగించే కూలింగ్ పరిష్కారాలపై ఈ సంస్థ దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. దీనివల్ల ఏపీ దేశంలోనే హెచ్వీఏసీల తయారీకి ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
