నయా రూట్ లో నయా బిజినెస్.. అదిరే ఐడియా

నయా రూట్ లో నయా బిజినెస్.. అదిరే ఐడియా

హైదరాబాద్, వెలుగు: స్ట్రీట్​బిజినెస్​ నయా ట్రెండ్​గా మారింది. కస్టమర్ల వద్దకే కావాల్సిన వస్తువులు, సర్వీసులను తీసుకెళ్లి అమ్ముతూ ​బిజినెస్ చేస్తున్నారు. కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తూ మొబైల్ వ్యాన్లు,  కార్లలో తిరుగుతూ ఏదైనా ఏరియాకు పోతున్నారు.  కొవిడ్​తో జాబ్​లు కోల్పోయిన వారు ఎక్కువమంది ఇప్పుడు ఈ బిజినెస్ లనే చేస్తున్నారు. ఏ ఏరియాలో చూసినా వీరే కనిపిస్తున్నారు. కూరగాయల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్​ వస్తువులు ఇలా అన్నిరకాల సామగ్రిని కార్లు, వ్యాన్లలో తీసుకెళ్లి సేల్ చేస్తున్నారు. గల్లీలు తిరిగి అమ్మడం, లేదంటే ఒక అడ్డా చేసుకుని పొద్దున్నుంచి రాత్రి వరకు ఉండి బిజినెస్ చేసుకుంటుండగా కస్టమర్ల నుంచి బాగానే రెస్పాన్స్​ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. 

కమర్షియల్​ స్పేస్​ అద్దెకు తీసుకుంటే..
కొవిడ్​, లాక్ డౌన్ తో ఎంతో మంది జాబ్​లు, ఉపాధి కోల్పోయారు. టీకొట్లు, కూరగాయల షాపులు, కూలీ, ఇతర పనుల వైపు మళ్లారు. అయితే డిఫరెంట్​గా, కస్టమర్లను ఆకట్టుకునేలా బిజినెస్​ చేస్తున్నారు.  ఏదైన ఏరియాలో చిన్న షాపు పెట్టాలన్నా ఒక కమర్షియల్ స్పేస్ ని అద్దెకు తీసుకోవాలి. దానికి రెంటు, మెయింటెనెన్స్ తో చూసుకుంటే వేలల్లో రెంటు అవడమే కాకుండా బిజినెస్  అయితదన్న నమ్మకం ఉండదు. తక్కువ పెట్టుబడితో నష్టం రాని స్టార్ట్​ చేసి  మొబైల్​బిజినెస్​ప్రారంభిస్తున్నారు.  వెహికల్​కొనడం లేదంటే, రెంటుకు తీసుకొని బట్టలు, కూరగాయలు, మాస్క్ లు, బైక్ కవర్ షీట్లు, డెకరేటివ్ వస్తువులు, వాచ్​లు, హెల్మెట్ లు ఇలా తమకు నచ్చిన బిజినెస్​ చేస్తున్నారు. 

పలు ప్రాంతాల్లో తిరుగుతూ..
మొబైల్​ బిజినెస్ లో వ్యాపారులు ఉండే ఏరియాతో పాటు సమీప ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నారు. ఉదయాన్నే కారు, వ్యాన్లలో సామాన్లు తీసుకుని పోయి ఒక అడ్డా చూసుకుని డిస్ ప్లే చేస్తున్నారు. ఒకవేళ కస్టమర్లు రాకపోతే ఇంకో ఏరియాకి వెళ్తున్నారు. ఉదయం నుంచి రాత్రి  వరకు బిజినెస్ చేస్తూ నెట్టుకొస్తున్నారు. టోలిచౌకి, ఫిలింనగర్, కూకకట్​పల్లి, కేపీహెచ్​బీ, గచ్చిబౌలి, ఎల్​బీనగర్  ఇలా  పలు ఏరియాల్లో ఇలాంటి బిజినెస్​లు రోడ్ల పక్కన కనిపిస్తున్నాయి. నచ్చిన చోటలో వెహికల్ ఆపుకుని అమ్ముతున్నారు. 

జాబ్ పోవడంతో  
ట్రాన్స్ పోర్ట్ షిప్పింగ్ లో జాబ్​ చేసేవాడిని. లాక్ డౌన్ లో పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఢిల్లీ వెళ్లి  బట్టలు, బండి తీసుకున్నా. షాపు అయితే డబ్బులు ఎక్కువైతది వ్యాన్ కొని బిజినెస్​ స్టార్ట్​ చేశా. ఏడాది నుంచి చేస్తున్నా. బంజారాహిల్స్, ఫిలింనగర్ లో ఇంకో రెండు వ్యాన్లు రన్​ చేస్తున్నా. కస్టమర్లు రాకపోతే వేరే ఏరియాకి పోయి అమ్ముకుంటా. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు బిజినెస్ చేస్తా  . 
‑ సయ్యద్ మజర్ అలీ, షేక్ పేట్ 

బంధువుల కారు అద్దెకు తీసుకుని..
కరోనా టైమ్​జాబ్​పోవడంతో  కొంతకాలం ఖాళీగా ఉన్నా. రెండు వారాల కిందట బిజినెస్​స్టార్ట్ చేశా. బట్టలు, షూలు, మాస్క్ లు అమ్ముతున్నా.  బంధువుల కారును అద్దెకు తీసుకుని చార్మినార్ వద్ద సామాన్లు కొని టోలిచౌకి, బంజారాహిల్స్ లో తిరుగుతూ అమ్ముతున్నా. ప్రస్తుతానికి బిజినెస్​ బాగానే అయితుంది. 
‑ నిజాం,టోలిచౌకి