గచ్చిబౌలి, వెలుగు : ఐటీ కారిడార్లో ఆకతాయిల తీరు మారట్లేదు. వీకెండ్ వచ్చిదంటే నాలెడ్జ్సిటీ రోడ్లపై బైక్ స్టంట్లతో హడలెత్తిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బైక్ రైసింగ్ లకు పాల్పడ్డ 40 మందిపై రాయదుర్గం పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. 40 బైకులను సీజ్ చేసి ఆర్టీఏ అధికారులకు అప్పగించారు.
