జూబ్లీహిల్స్, వెలుగు: అడ్వాన్స్డ్సైబర్ సెక్యూరిటీ ఆన్ లైన్ కోర్సుకు ఓ విద్యార్థిని ఆన్లైన్లో డబ్బులు చెల్లించింది.. 9 నెలలైనా క్లాస్‌లు చెప్పకపోవడంతో తండ్రితో కలిసి మధురానగర్పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధురానగర్‌లోని జుపిటర్ టవర్స్‌లో నివాసముంటున్న మాకినేని వీరబ్రహ్మం కూతురు ఈ ఏడాది మార్చి 18న సైబర్ సెక్యూరిటీ కోర్సు కోసం ఆన్ లైన్లో వెతకింది. ట్యూటెల్ఇన్ఫోసెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆ కోర్సు అందిస్తున్నట్లు గుర్తించింది. అందులో చేరేందుకు రెండు దఫాలుగా రూ.80 వేలు ఆన్ లైన్ ద్వారా చెల్లించింది.
ఫీజు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లాస్ లు అందించలేదు. ఎన్నోసార్లు సదరు కంపెనీ ప్రతినిధులను ఆన్ లైన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. విద్యాసంవత్సరాన్ని కోల్పోయానని, కనీసం తాను పంపిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలని పలుమార్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టింది. అయినా సమాధానం రాకపోవడంతో బాధితురాలి తండ్రి ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

