రియల్ వ్యాపారి నుంచి డబ్బులు డిమాండ్..ఓ యూట్యూబ్‌‌ ఛానల్‌‌ సీఈవో,  మహిళా రిపోర్టర్‌‌పై కేసు

రియల్ వ్యాపారి నుంచి డబ్బులు డిమాండ్..ఓ యూట్యూబ్‌‌ ఛానల్‌‌ సీఈవో,  మహిళా రిపోర్టర్‌‌పై కేసు

గండిపేట్, వెలుగు : రియల్‌‌ ఎస్టేట్‌‌ కంపెనీ నుంచి డబ్బులు డిమాండ్‌‌ చేసిన ఓ యూట్యూబ్‌‌ చానల్‌‌ సీఈఓ, రిపోర్టర్‌‌పై నార్సింగి పీఎస్​లో కేసు నమోదైంది. పోలీసులు వివరాల ప్రకారం.. తొలుత మూసీ బఫర్‌‌ జోన్​లో నిర్మాణాలు చేపడుతున్నారని, సైట్‌‌లోకి వచ్చి ఓ యూట్యూబ్‌‌ ఛానల్‌‌ మహిళా రిపోర్టర్ బెదిరింపులకు పాల్పడింది.

డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఇదంతా బయటకు చెబుతామని బ్లాక్ మెయిల్ చేస్తూ సదరు ఛానల్ సీఈఓతో ఫోన్​లో మాట్లాడించింది. దీంతో ఆదిత్య కేడియో రియల్టర్స్‌‌ మేనేజర్‌‌ ఇచ్చిన ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.