కిక్కు దిగాలి : హైదరాబాద్ పబ్బుల భరతం పడుతున్న పోలీసులు

కిక్కు దిగాలి : హైదరాబాద్ పబ్బుల భరతం పడుతున్న పోలీసులు

హైదరాబాద్లో పబ్బులు ఆగడాలు మితీమిరాయి.  రూల్స్, టైమ్ అస్సలు పాటించడం లేదు.  ఏకంగా హైకోర్టు హెచ్చరించిన పట్టించుకోవటంలేదు.  లైసెన్స్ లేకుండా కొందరు నిర్వాహకులు డీజే నడుపుతున్నారు.  నైట్ టైమ్ అయిపోయాక కూడా మ్యూజిక్ తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే   రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న తొమ్మిది పబ్స్ రాత్రి పది దాటిన తర్వాత మ్యూజిక్ పెట్టొద్దంటూ హైకోర్టు ఆంక్షలు విధించినప్పటికీ లెక్కచేయడం  లేదు. అలాంటి పబ్బులపై పోలీసులు కొరడా ఝలిపించారు.  

భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ లోని ఆరు పబ్ల యజమానులు, మేనేజర్ల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. అమ్యూజ్మెంట్ లైసెన్స్ లేకుండా నడుస్తున్న  జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35 క్లబ్ రోగ్ పబ్, రోడ్ నెంబర్ 45లో పోర్టు పబ్, హలో కాక్ టేయిల్, ఫ్యాట్ ఫిజీయన్ పబ్, రోడ్ నెంబర్ 10లోని జీరో 40 పబ్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు.  లైసెన్స్ వచ్చేదాకా మ్యూజిక్ ప్లే చేసేందుకు వీల్లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు.  ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని  తెలిపారు.