
పేకాటకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి.. తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, నూజివీడులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగింది. బ్యాంకులో హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న రవితేజ ఆన్‌లైన్‌లో రమ్మీ, క్యాసినో ఆడేవాడు. వాటికి బాగా బానిసగా మారిన రవితేజ డబ్బులకు ఇబ్బందిపడేవాడు. దాంతో తాను పనిచేస్తున్న బ్యాంకు గుర్తుకువచ్చింది. వెంటనే బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ.1.56 కోట్లు కొట్టేశాడు. ఈ భారీ స్కామ్‌ను గుర్తించిన బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రవితేజ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రవితేజ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఖాతాదారులు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని బ్యాంకు అధికారులు అంటున్నారు.
For More News..