క్యాష్‌‌‌‌‌‌‌‌లెస్ ట్రీట్మెంటే కావాలి.. రీయింబర్స్మెంట్ వద్దంటున్న రోగులు

క్యాష్‌‌‌‌‌‌‌‌లెస్ ట్రీట్మెంటే కావాలి.. రీయింబర్స్మెంట్ వద్దంటున్న రోగులు

న్యూఢిల్లీ: హెల్త్​ ఇన్సూరెన్స్ ​పాలసీ హోల్డర్లు రీయింబర్స్​మెంట్​ కంటే క్యాష్‌‌‌‌‌‌‌‌లెస్  క్లెయిమ్ విధానాన్ని ఇష్టపడుతున్నారని పాలసీ బజార్ నిర్వహించిన హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ (హెచ్‌‌‌‌‌‌‌‌సీఎక్స్) ఇండెక్స్ స్టడీ తెలిపింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 2,300 మంది పాల్గొన్నారు. 

క్యాష్‌‌‌‌‌‌‌‌లెస్ విధానంలో తక్కువ పత్రాలు అవసరం అవుతాయి.  వేగంగా అప్రూవల్స్​వస్తాయి. రీయింబర్స్​మెంట్​ విధానంలో రోగులపై ఆర్థిక భారం పెరుగుతోంది. రీయింబర్స్​మెంట్​ క్లెయిమ్ చేసిన వారిలో 76 శాతం మంది చికిత్స కోసం అప్పులు తీసుకున్నామని తెలిపారు.

క్యాష్‌‌‌‌‌‌‌‌లెస్ క్లెయిమ్స్ 86.7 స్కోరు నమోదు చేయగా, రీయింబర్స్​మెంట్​ క్లెయిమ్స్ 73.7 స్కోరు సాధించాయి.  దేశం మొత్తం హెచ్‌‌‌‌‌‌‌‌సీఎక్స్ స్కోరు వందకు 82.8 గా ఉంది. ఇది మధ్యస్థ వర్గంలో నిలిచింది. క్లెయిమ్ నిర్ణయాల్లో మరింత పారదర్శకత ఉండాలని పాలసీ హోల్డర్లు కోరారు. 

అన్ని రకాల క్లెయిమ్స్​కు ఒకేరకమైన క్లెయిమ్ ఫారమ్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టాలని ఇన్సూరెన్స్ సంస్థలకు పాలసీ బజార్​ సిఫార్సు చేసింది. క్లెయిమ్ విధానాలను కస్టమర్లు స్పష్టంగా అర్థం చేసుకోవడం ముఖ్యమని పేర్కొంది.