జగిత్యాల జిల్లాలో కుల బహిష్కరణ

జగిత్యాల జిల్లాలో కుల బహిష్కరణ

పోలీస్ ​కేసు పెట్టిన బాధితులపై గ్రామస్తుల దాడి
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలోని బావాజీ పల్లెలో దారుణం జరిగింది. ఓ కుటుంబాన్ని గ్రామంలోని పెద్దలు కులం నుంచి బహిష్కరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో గ్రామస్తులంతా కలిసి బాధితుల ఇంటిపై దాడి చేసి కొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బావాజీ పల్లెకు చెందిన గంగ నీలయ్య కుటుంబాన్ని కుల పెద్దలు వారం రోజుల క్రితం ఓ పంచాయితీ విషయంలో కులం నుంచి బహిష్కరించారు. దీంతో నీలయ్య జగిత్యాల రూరల్​ పీఎస్​లో కంప్లైంట్ ​చేశాడు. పోలీసులు గ్రామంలోని ఆరుగురిపై కేసు ఫైల్​ చేశారు. కేసు పెట్టాడన్న కోపంతో సోమవారం గ్రామస్తులంతా కలిసి నీలయ్య ఇంటిపై దాడి చేశారు. నీలయ్యతోపాటు అతని భార్యను కొట్టారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దాడి విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్‌‌ ఎస్సై చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకుని15 మందిపై కేసు నమోదు చేశారు. మరోసారి గొడవ జరగకుండా గ్రామంలో పికెటింగ్‌‌ ఏర్పాటు చేశారు.